Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జిమ్‌లో వెయిట్‌ లిఫ్ట్ చేస్తోన్న నటి స్నేహ.. వీడియో చూడండి!

  • ప్రస్తుతం స్నేహ చేతిలో రెండు సినిమాలు
  • రామ్‌చరణ్, బోయపాటి శ్రీను సినిమాలో కీలక పాత్రలో స్నేహ
  • కొత్త ప్రయాణం మొదలైందంటోన్న నటి
తెలుగు, తమిళ సినిమాల్లో నాయికగా నటించి మంచి పేరు తెచ్చుకున్న నటి స్నేహ చేతిలో ఇప్పుడు రెండు సినిమాలు ఉన్నాయి. ‘మునిరత్న కురుక్షేత్ర’ అనే కన్నడ సినిమాతో పాటు త్వరలో రూపుదిద్దుకోనున్న రామ్‌చరణ్, బోయపాటి శ్రీను సినిమాలోనూ నటించనుంది. చెర్రీ సినిమాలో స్నేహది ఓ ప్రధానపాత్ర కావడంతో, ప్రస్తుతం స్నేహ జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేస్తూ ఫిట్‌గా తయారు అవుతోంది.

తాజాగా తాను జిమ్‌లో వెయిట్‌ లిఫ్ట్ చేస్తోన్న ఓ వీడియోను స్నేహ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. తాను న్యూ జర్నీ స్టార్ట్ చేశానని, చేరుకోవాల్సిన గమ్యం చాలా దూరంలో ఉందని ఆమె పేర్కొంది. స్నేహ జిమ్‌లో కసరత్తులు చేస్తోన్న వీడియోను మీరూ చూడండి... 
Viral Videos
sneha
Gym

More Telugu News